ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గురువారం పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. ఓ ప్రైవేటు స్కూల్ బస్సును టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.