ప్రకాశం జిల్లా సింగరాయకొండ నయారా పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి నడిచి వెళ్తున్న పాదచారుడిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నర్రవారి పాలెం కి చెందిన వెంకటేశ్వర్లు(45)గా గుర్తించారు. ప్రమాదంపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టిన తర్వాత ఆగకుండా వెళ్ళిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.