ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు సమీపంలో ఈనెల 12వ తేదీన ద్విచక్ర వాహనం అదుపుతప్పి బాపట్ల జిల్లాకు చెందిన మహబూబ్ సుభాని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించి అనంతరం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహబూబ్ సుభాని మంగళవారం మృతి చెందినట్లుగా ఎస్ఐ మహేంద్ర వెల్లడించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.