ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సమీపంలో ఉన్న సముద్రం లో ఆదివారం సందడి నెలకొంది. ఏకాదశి తో పాటు సెలవు దినం కావడంతో పర్యటకులు భారీగా తరలివచ్చారు. సముద్ర అలల ఆటుపోట్లు సాధారణంగా ఉండడంతో పర్యటకులు అధికంగా వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పర్యటకులు మరింత లోతుకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.