పాత సింగరాయకొండలో జరుగుతున్న వరాహలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల పోటీలను సోమవారం నిర్వహించారు. ఇందులో సంతనూతలపాడు మండలానికి చెందిన ఎనికెపాడు శ్రీనివాస్ పొట్టేళ్ల జత మొదటి స్థానాన్ని సాధించగా మేదరమెట్ల మండలానికి చెందిన రవి పొట్టేళ్ల జత రెండో స్థానం సాధించింది. విజేతలకు బహుమతులు అందజేశారు.