రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 341 కోట్లతో 20,692 మంది దళితులకు రుణాలు ఇవ్వబోతున్నామని మంత్రి స్వామి శనివారం అన్నారు. సింగరాయకొండలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్ ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. గత 5 ఏళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఒక రూ. లక్ష రుణం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎస్సీ విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామన్నారు.