సింగరాయకొండ: మెరిసిన మట్టిలో మాణిక్యం

60చూసినవారు
సింగరాయకొండ: మెరిసిన మట్టిలో మాణిక్యం
సింగరాయకొండ మండలం పాకాలపల్లె పాలెంకు చెందిన మట్టిలో మాణిక్యం గొల్లపోతు గాయత్రి ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసింది. ఒంగోలులోని సరస్వతి కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదివిన గాయత్రి 470 గాను 457 మార్కులు సాధించింది. తండ్రి సుబ్బారావు మత్స్యకార వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు ద్వితీయ కుమార్తె అయిన గాయత్రి ప్రభుత్వం తనకు చేయూతను అందించాలని తల్లిదండ్రులు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్