ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించారు. అలానే బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు భద్రతను ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించుకున్న ఎస్పీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు.