శనివారం మంత్రి స్వామి పాత సింగరాయకొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి స్వామిని ఘనంగా స్వాగతించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు.