సింగరాయకొండ మండలం సోమరాజుపల్లికి చెందిన శ్రీహరి ఈనెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన సందర్భంలో శ్రీహరి తప్పిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు తానంతకు తానే ఇంటికి సురక్షితంగా వచ్చాడని శుక్రవారం బాలుడి తండ్రి వెల్లడించారు. శ్రీహరి తన స్నేహితుడి ఇంటికి వెళ్లినట్లుగా తెలిపాడు.