సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం ఎస్సై మహేంద్రా విద్యార్థులకు సైబర్ నేరాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించారు. విద్యార్థినిలు తమ పట్ల వ్యక్తులు వ్యవహరించి తీరు గమనిస్తూ ఉండాలని అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా తాము చెప్పిన విషయాలను మీ తల్లిదండ్రులకు విద్యార్థులు తెలియచేయాలని విద్యార్థులకు ఎస్ఐ తెలిపారు.