ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ దామోదర్ ఆదివారం సందర్శించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎస్సై సీఐలకు సూచనలు సలహాలు ఇచ్చారు. దాతల సహకారంతో పోలీస్ స్టేషనులకు మరమ్మతులు చేయించడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. తర్వాత నేరాల నియంత్రణ పై ఎస్పీ దామోదర్ పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు.