టంగుటూరు: బహిరంగంగా మద్యం తాగిన వారికి కౌన్సిలింగ్

61చూసినవారు
టంగుటూరు: బహిరంగంగా మద్యం తాగిన వారికి కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలంలో బహిరంగంగా శుక్రవారం మద్యం తాగిన వారికి స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడంతో పాటు వారిని మందలించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం చట్టరీత్యా నేరమని మండల ప్రజలను ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తీవ్రంగా హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులకు 100 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్