టంగుటూరు మండలం నాయుడుపాలెం వద్ద ఆదివారం కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు నుంచి వెళుతున్న జిల్లా ఎస్పీ దామోదర్ రోడ్డు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.