మార్కాపురం పట్టణంలోని ముత రాసి కాలనీలో ఏడుకొండలు అనే వ్యక్తి రోకలి బండతో కుటుంబ సభ్యులపై శనివారం దాడి చేశాడు. ఏడుకొండలు తన తల్లి గాలెమ్మ, భార్య అరుణ, అన్న కోడలు పై రోకలి బండతో దాడి చేయడంతో భయంతో వారు కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి అతనిని అదుపు చేశారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఏడుకొండలకు మతిస్థిమితం లేదని స్థానికులు చెప్పారు.