మార్కాపురంలో కార్డెన్ సర్చ్

69చూసినవారు
మార్కాపురంలో కార్డెన్ సర్చ్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏకవల్య కాలనీలో బుధవారం స్థానిక సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత స్థానిక ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ దొంగతనాలు అరికట్టే అంశంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని సిఐ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్