మార్కాపురంలో మైనర్లకు కౌన్సిలింగ్

79చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఎస్సై సైదుబాబు మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనారిటీ తీరకుండా ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతారని, అలాంటి సందర్భాల్లో వాహన యజమానిని బాధ్యులుగా చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై వారిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్