మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో బుధవారం పోలీసులు డ్రోన్ సహాయంతో సమస్యాత్మకమైన ప్రాంతాలను పరిశీలించారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈరోజు కార్డెన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు అనుమానస్పద ప్రాంతాలపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. తప్పు చేసింది ఎంతటి వారైనా సరే పోలీసుల నుంచి తప్పించుకోలేరని సీఐ సుబ్బారావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.