మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు.!

0చూసినవారు
మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు.!
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పడనుంది. ఎన్నికల హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబూ ఇదే హామీ ఇచ్చారు. ఇప్పుడా కల నెరవేరే దిశగా ప్రయాణిస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఈ జిల్లా రూపొందనుంది.

సంబంధిత పోస్ట్