మాజీ సీఎం అసమర్థుడని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీ సమావేశాలలో జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రూ. 9లక్షలకు పైగా అప్పులు మిగిల్చిన ఘనత మాజీ సీఎంకే దక్కుతుందన్నారు. విద్యుత్ సంస్కరణలకు తూట్లు పొడిచి ప్రజలపై రూ. లక్ష కోట్లకు పైగా మాజీ సీఎం భారం వేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం లేని వాడికి సీఎం పదవి కట్టబడితే ఏ విధంగా ఉంటుందో ప్రజలు కల్లారా చూసారన్నారు.