పొదిలి లో బుధవారం మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాళ్ల దాడిలో ఇద్దరు మహిళలతో పాటు ఓ కానిస్టేబుల్ మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గో బ్యాక్ జగన్ అంటూ మహిళలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కార్యకర్తలు రాళ్ల దాడికి దిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.