మార్కాపురంలో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.