మార్కాపురం పట్టణంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. బలమైన ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.