మార్కాపురం నియోజకవర్గంలో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలికి రానున్నారు. ఆయన పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా, అదే సమయానికి మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందని కమిషనర్ తెలిపారు. దీంతో జిల్లా రాజకీయ వాతావరణం వేడెక్కింది.