మార్కాపురంలో టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ

66చూసినవారు
మార్కాపురంలో టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు పోలేరమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. చరిత్రలో ఇంతమంది బైక్ ర్యాలీలో పాల్గొన్న సంఘటన లేనేలేదని నారాయణరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్