ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెడ్డి మహిళా జూనియర్ కళాశాల నందు ఏపీ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుపతిరావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలకు మూతి జబ్బులు వచ్చి మృత్యువాత పడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూతి జబ్బు నివారణ కోసం నిధులు కేటాయించి మందులు సరఫరా చేసి మూగజీవాలను కాపాడాలని డిమాండ్ చేశారు.