కొనకనమిట్ల: మహిళలంటే వైసిపికి గౌరవం లేదు

56చూసినవారు
మహిళలంటే వైసిపికి గౌరవం లేదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కొనకనమిట్ల గ్రామంలో పర్యటించిన నారాయణరెడ్డి అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వైసిపి మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. సాక్షి ఛానల్ లో కృష్ణంరాజు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దీనిపై ఇంతవరకు స్పందించకుండా మహిళలకు క్షమాపణ చెప్పకుండా సమర్ధించడం సరైనది కాదన్నారు.

సంబంధిత పోస్ట్