గ్రామాల్లో పశువులకు త్రాగునీరు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ మంజూరు చేసిన నీటి తొట్లను త్వరగా పూర్తిచేయాలని ఎంపీడీవో షేక్ మహబూబ్ బాషా అన్నారు. బుధవారం వెలిగండ్ల మండలంలోని మొగల్లూరుపల్లి గ్రామంలో ఉపాధి సిబ్బందితో కలిసి నీటి తొట్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ కొలతల ప్రకారం నీటి తొట్లు నిర్మించాలని కోరారు. నీటి తొట్లు వేగవంతంగా పూర్తి చేసేలా సిబ్బంది పనిచేయాలని కోరారు.