మార్కాపురానికి చెందిన జవ్వాజి అశోక్ ఇప్పటివరకు 18 సార్లు రక్తదానం చేశారు. 20వ ఏట నుంచి రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన, ప్రత్యేకంగా పేద గర్భిణులకు సాయం చేయడం తన లక్ష్యమంటున్నారు. తాను మాత్రమే కాదు, తన స్నేహితుల ద్వారా నెలకు 30 మందికి పైగా గర్భిణులకు రక్తదానం జరగేలా చేస్తూ, సుమారు 70 మందిని రక్తదాతలుగా తీర్చిదిద్దారు.