మార్కాపురం: దాడి కేసులో నిందితుల పట్టివేత..?

69చూసినవారు
మార్కాపురం: దాడి కేసులో నిందితుల పట్టివేత..?
మార్కాపురంలోని దొడ్డవారి వీధిలో నివాసం ఉంటున్న వృద్ధురాలిపై ఈనెల 13వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి రూ. 10 లక్షలు విలువచేసే బంగారాన్ని అపహరించి తీసుకువెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దాడి సమయంలో వృద్ధురాలి కంట్లో నిందితులు కారం కొట్టారు.

సంబంధిత పోస్ట్