ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో బుధవారం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు ఓటిపి ఫ్రాడ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి మీ తల్లిదండ్రులు మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను డిఎస్పి నాగరాజు విద్యార్థులకు వివరించారు.