మార్కాపురంలో శనివారం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు నిరసనకు దిగారు. మరి కొన్ని గంటల్లో డాకు మహారాజ్ సినిమా విడుదల కావలసి ఉండగా ఇప్పటివరకు సినిమా విడుదలపై స్పష్టత రాకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని సినిమా హాళ్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి సినిమా విడుదలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మా అభిమాన హీరో సినిమా విడుదలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.