మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శేష వాహనం పై శ్రీ కాళీయమర్థన అలంకరణలో శ్రీ చెన్నకేశవ స్వామివారు పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శేష వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేశారు.