మార్కాపురం పట్టణం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆశీర్వదించి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారి సేవలో పాల్గొన్నారు.