విద్యుత్ చౌర్యానికి పాల్పడడంతో పాటు అధిక లోడు ఉపయోగిస్తున్న 58 మంది వినియోగదారులకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. మంగళవారం 1,351 సర్వీసులను తనిఖీ చేసిన అధికారులు 58 మందికి రూ. లక్ష, 97 వేలు నగదును జరిమానాగా విధించారు. తనిఖీలలో మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఒంగోలు డీ.పీ.ఈ ఉషారాణి, తదితర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.