ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 34 మందికి ఆదివారం రూ. 29 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి సహాయం చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోరాదని విజ్ఞప్తి చేశారు.