మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో తన మూడెకరాల భూమిని మాజీమంత్రి ఆదిమూలపు సురేష్, అతని తమ్ముడు కబ్జా చేశారని శుక్రవారం బాధితుడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పలుమార్లు అధికారులను కలిసి తన భూమిని తనకు ఇప్పించాలని అర్జీలు ఇచ్చిన గతంలో ఉపయోగం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.