మార్కాపురం: ఆలయానికి పోటెత్తిన భక్తులు

57చూసినవారు
మార్కాపురం: ఆలయానికి పోటెత్తిన భక్తులు
మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున కలియుగ దైవమైన విష్ణుమూర్తిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని అర్చకులు తెలిపారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్