మార్కాపురంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి వేడుకలలో పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ అన్నా కృష్ణ చైతన్య భోగి మంటలను వేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గాలిపటాలు ఎగరేసి విద్యార్థులను ఆయన ఉత్సాహపరిచారు. విద్యార్థినీలు రకరకాల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. మన సంప్రదాయాలను మర్చిపోకూడదని కృష్ణ చైతన్య అన్నారు.