మార్కాపురం: రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం

63చూసినవారు
మార్కాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో పాటు రాత్రి చంద్రప్రభ వాహనంతో ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 5 గంటల సమయంలో వెండి రథంపై శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి మూఢవీధుల్లో విహరిస్తారు.

సంబంధిత పోస్ట్