ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శనివారం 2 టౌన్ ఎస్ఐ రాజా మోహన్ రావు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతూ హెల్మెట్ ధరించని 26 ద్విచక్ర వాహనదారులకు ఎస్సై జరిమానా విధించారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనదారులకు రాజమోహన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.