మార్కాపురంలోని మాజి కౌన్సిలర్ వైసీపీ నాయకులు దూదేకుల ఖాసీంపిరా అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. ఈవిషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు ఖాసీంపిరా ఇంటికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.