మార్కాపురం మండలం రాయవరం చెరువులో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతంగా మారింది. కొందరు వ్యక్తులు ఇటుకల బట్టిలు ఏర్పాటు చేసుకొని ఇటుకలు తయారు చేస్తున్నారు. అధికారులు ఆక్రమణల తొలగింపులో ఇటుకలు ధ్వంసం అవుతున్నాయి. విషయాలు తెలుసుకొని అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు అధికారులు 3 రోజులు సమయం ఇవ్వాల్సిందే అని భీష్మించుకొని అక్కడే కూర్చున్నారు. అధికారులు కూడా దిగివచ్చి అందుకు ఒప్పుకున్నారు.