ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శనివారం ఎస్సై రాజమోహన్ రావు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు ఎస్ఐ జరిమానా విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరణాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు ఇక తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలకు వాహనదారులు సహకరించాలన్నారు.