ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ హుండీని శుక్రవారం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి సమక్షంలో లెక్కించారు. 3 నెలల వ్యవధిలో భక్తులు హుండీలో రూ. 5, 85, 374 నగదును కానుకలు వేసినట్లుగా ఆలయ ఈవో తెలిపారు. హుండీ లెక్కింపు అనంతరం నగదును ఆలయ ఖజానాకు తరలిస్తామని శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు.