మార్కాపురం: ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష

56చూసినవారు
మార్కాపురం: ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష
ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి గురువారం 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 2007లో పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన కటికల జీవన్ కుమార్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆటోని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఏసుదాసు అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్