ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో గురువారం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న తలంపుతో మెగా జాబ్ మేళా నిర్వహించడంపై ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.