ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు భూ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు వ్యవహరించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో అత్యధికంగా భూకబ్జాలు జరిగినట్లుగా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు.