వెలిగొండ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే ప్రాజెక్ట్ లోకి నీళ్లు వస్తాయి అంటూ జగన్ అబద్దాలు చెప్పారని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి మంగళవారం అన్నారు. నేను చంద్రబాబు కాళ్లు, గడ్డాలు పట్టుకుని అయినా ఆర్ఆర్ ప్యాకేజీ తీసుకువస్తా జగన్ కు దమ్ముంటే నీళ్లు పారించాలి. కూటమి ప్రభుత్వం 2025కల్లా వెలిగొండను పూర్తిచేస్తుంది. అలాగే మార్కాపురాన్ని జిల్లా చేస్తాం అని కందుల హామీ ఇచ్చారు.