ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై 140 వరకు అర్జీలు ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. వచ్చిన సమస్యలు దాదాపు పరిష్కరించబడతాయని ఎమ్మెల్యే అన్నారు. అధికారుల సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.